Telangana DSC Results 2024: అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు రానే వచ్చాయి.. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డీఎస్సీ (DSc Result) ఫలితాలను విడుదల చేశారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు రానే వచ్చాయి.. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డీఎస్సీ (DSc Result) ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రభుత్వం విడుదల చేశారు. ప్రస్తుతం DSC జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయగా.. రేపు జిల్లాలకు జాబితా రానుంది.. వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండనుంది. తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి..
ఫలితాల కోసం డైరెక్ట్ లింక్..
Telangana DSC Results 2024 Link : తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అయితే.. కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి.. జిల్లాల వారీగా.. తరువాత merit cum roster ప్రకారం సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా DEO లకు ఇస్తారని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం.. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
డీఎస్సీ ఫలితాలు లైవ్ వీడియో చూడండి..
కాగా.. ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ సారి DSC పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి సరికొత్త రికార్డు నెలకొల్పింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించింది. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు హాజరు కాగా.. ఆగస్టు 13న రాష్ట్ర విద్యాశాఖ ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించగా.. సెప్టెంబర్ 6న ఫైనల్ కీని విడుదల చేసింది..
మొత్తం పోస్టులు ఇలా..
2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.