TS Inter Supply Exams 2025: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పోటెత్తిన దరఖాస్తులు.. వామ్మో అన్ని లక్షలా?
రాష్ట్రంలో మే 22వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఊహించని విధంగా లక్షలాది దరఖాస్తులు రావడం ఇంటర్ బోర్డును విస్మయానికి గురి చేసింది. నిజానికి, ఏప్రిల్ 22న విడుదలైన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో తొలి ఏడాదిలో తప్పిన విద్యార్థుల సంఖ్య 1.91 లక్షల మంది మాత్రమే. అయితే..

హైదరాబాద్, మే 14: తెలంగాన రాష్ట్రంలో మే 22వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వారిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మంది, ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. నిజానికి, ఏప్రిల్ 22న విడుదలైన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో తొలి ఏడాదిలో తప్పిన విద్యార్థుల సంఖ్య 1.91 లక్షల మంది మాత్రమే. అయితే మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ రాసేవారు ఏకంగా 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడంతో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక సెకండియర్ జనరల్ పరీక్షలకు 1,34,341 మంది, ఒకేషనల్‌కు 12,357 మంది పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులు మే 13వ తేదీతో ముగిసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అధికారులు దరఖాస్తు గడువు పొడించడంతో మంగళవారం సాయత్రం వరకు రూ. 2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇక ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 22 నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
ఇంటర్ ఫస్టియర్ (జనరల్, ఒకేషనల్) 2025 సప్లిమెంటరీ టైమ్ టేబుల్ ఇదే..
- 22 మే – పార్ట్-2: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- 23 మే – పార్ట్-1, ఇంగ్లీష్ పేపర్ 1
- 24 మే – పార్ట్-3, మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
- 25 మే – మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
- 26 మే – ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్ 1
- 27 మే – కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
- 28 మే – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 (BiPC విద్యార్థులకు)
- 29 మే – మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1
ఇంటర్ సెకండియర్ (జనరల్, ఒకేషనల్) 2025 సప్లిమెంటరీ టైమ్ టేబుల్..
- 22 మే – పార్ట్ 2, సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- 23 మే – పార్ట్ 1, ఇంగ్లీష్ పేపర్ 2
- 24 మే – పార్ట్ 3: మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
- 25 మే – మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జంతుశాస్త్రం పేపర్ 2, చరిత్ర పేపర్ 2
- 26 మే – ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
- 27 మే – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ 2 (BiPC విద్యార్థులకు)
- 29 మే – మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, భౌగోళిక శాస్త్రం పేపర్ 2
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




