AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Curry: శుభకార్యంలో మటన్‌ కూరతో విందు.. ఆబగా తింటుండగా అనుకోని విషాదం! ఏం జరిగిందంటే

కొందరు ఇష్టమైన కూర అయితే ఆబగా లాగించేస్తుంటారు. ఇలాంటప్పుడే అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి శుభకార్యానికి వెళ్లి అక్కడ విందులో మటన్‌ కూరతో భోజనం చేస్తున్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ ఉన్నట్టుండి దారుణం చోటు చేసుకుంది..

Mutton Curry: శుభకార్యంలో మటన్‌ కూరతో విందు.. ఆబగా తింటుండగా అనుకోని విషాదం! ఏం జరిగిందంటే
Mutton Curry
Srilakshmi C
|

Updated on: May 13, 2025 | 10:48 AM

Share

కోటగిరి, మే 13: ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరబాట్లకు పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు పెద్దవాళ్లు కొన్ని నియమాలు పాటించాలని చెబుతుంటారు. వాటిల్లో కొన్ని.. నేలపై బాసింపట్టు వేసి కూర్చుని భోజనం చేయడం, భోజనం తినేటప్పుడు మాట్లాడకపోవడం వంటివి చెబుతుంటారు. కానీ నేటి తరం మాత్రం వాటిని పెడచెవిన పెట్టి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొందరు ఇష్టమైన కూర అయితే ఆబగా లాగించేస్తుంటారు. ఇలాంటప్పుడే అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి.

తాజాగా ఓ వ్యక్తి శుభకార్యానికి వెళ్లి అక్కడ విందులో మటన్‌ కూరతో భోజనం చేస్తున్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ మటన్‌ ముక్క అతడి గొంతులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు సరికదా.. కాసేపటికే ఊపిరాడక సదరు వ్యక్తి మృతిచెందాడు. ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సుద్దులతండాలో ఆదివారం (మే 11) చోటుచేసుకున్నది. కోటగిరి ఎస్సై సునీల్‌ వివరాల ప్రకారం..

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన రుత్వన్‌ తారా సింగ్‌ (48) భార్యతో కలిసి నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సుద్దులంతండాలోని బంధువుల ఇంటికి ఫంక్షన్‌కి వెళ్లాడు. అక్కడ పంక్తి భోజనం చేస్తుండగా ఉన్నట్లుండి మటన్‌ముక్క రుత్వన్‌ తారా సింగ్‌ గొంతులో ఇరుక్కు పోయింది. ఎంత ప్రయత్నించినా గొంతులోని మటన్‌ ముక్క బయటకు రాలేదు. కాసేపటికే రుత్వాన్​ తారాసింగ్​అపస్మారక స్థితికి చేరుకోవడంతో బంధువులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

Mutton

అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకూ తమ కళ్ల ముందే ఉన్న వ్యక్తి ఉన్నట్లుండి ఇలా విగత జీవిగా మారడంతో భార్య, బంధువులు ఘొల్లుమన్నారు. మృతుడి భార్య రుత్వన్‌ యమునాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!