AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Govt Jobs: ఈ కేంద్ర ప్రభుత్వ కొలువులకు దరఖాస్తు చేశారా? జూన్‌ నెలలో ముగుస్తున్న తుది గడువు..

ఈ ఏడాది పలు రకాలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు విడదలయ్యాయి. ఈ నోటిఫికేషన్లు అన్నింటికీ ఆన్‌లైన్‌ దరఖాస్తు తుది గడువు జూన్ 2025 నెలలో ముగియనుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని కలలుకనే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు..

Central Govt Jobs: ఈ కేంద్ర ప్రభుత్వ కొలువులకు దరఖాస్తు చేశారా? జూన్‌ నెలలో ముగుస్తున్న తుది గడువు..
Central Govt Jobs
Srilakshmi C
|

Updated on: Jun 03, 2025 | 5:42 PM

Share

సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగాలకు యువతలో యమ క్రేజ్‌ ఉంది. ఈ ఏడాది పలు రకాలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు విడదలయ్యాయి. ఈ నోటిఫికేషన్లు అన్నింటికీ ఆన్‌లైన్‌ దరఖాస్తు తుది గడువు జూన్ 2025 నెలలో ముగియనుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని కలలుకనే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఉద్యోగాలలో లీగల్ ఆఫీసర్, ఆపరేషన్ ఆఫీసర్, సెయిలర్ (డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్) వంటి పోస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు దాని అనుబంధ సంస్థలకు చెందిన పలు ఉద్యోగ ప్రకటనలకు ప్రస్తుతం ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆయా ఉద్యోగాల వివరాలతోపాటు దరఖాస్తు ముగింపు తేదీలను ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. లీగల్ ఆఫీసర్, ఆపరేషన్స్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మొత్తం 493 పోస్టుల భర్తీ కోసం ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నేరుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 12, 2025. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

IRCONలో సివిల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్).. జాయింట్ జనరల్ మేనేజర్, సివిల్ అండ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్, సివిల్ పోస్టుల కోసం ఉద్యోగ దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి కోరుతుంది. ఆసక్తి కలిగిన వారు జూన్ 20, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నేవీలో స్పోర్ట్స్ ఎంట్రీ ఆఫీసర్ కొలువులు

భారత నావికాదళం సెయిలర్.. డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్, చీఫ్ పెట్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు నావల్ బేస్‌లలో కొలువు సొంతం చేసుకోవడానికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 17, 2025. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

NEEPCO ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు

విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని షెడ్యూల్-‘ఎ’ మినీ రత్న CPSE అయిన నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO).. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్), ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హిందీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు జూన్ 4, 2025తో ముగియనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

CISF హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా-2025 కింద మొత్తం 403 హెడ్ కానిస్టేబుల్స్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతోంది. హెడ్​కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువుగా జూన్ 6, 2025వ తేదీని నిర్ణయించారు. తుడి గడువులోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.