Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGRJC CET 2025 Notification: టీజీఆర్‌జేసీ సెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. గురుకులాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు ఛాన్స్!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్​ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్​ ఇంగ్లిష్‌ మీడియం మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్​ కాలేజీల్లో..

TGRJC CET 2025 Notification: టీజీఆర్‌జేసీ సెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. గురుకులాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు ఛాన్స్!
TGRJC CET 2025
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 05, 2025 | 2:38 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్​ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్​ ఇంగ్లిష్‌ మీడియం మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. ఇందులో బాలురకు 15, బాలికలకు 20 గురుకుల జూనియర్ కాలేజీలు​ ఉన్నాయి. ఇందులో సీటు పొందిన విద్యార్ధులకు ఉచిత విద్యతోపాటు వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్‌ 23వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి రాత పరీక్ష మే 10వ తేదీన నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 2025 మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.200 చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2,996 వరకు సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఎంపీసీ గ్రూపులో 1,496 సీట్లు, బైపీసీ గ్రూపులో 1,440 సీట్లు, ఎంఈసీ గ్రూపులో 60 సీట్లు ఉన్నాయి.

పరీక్ష విధానం ఇలా..

మొత్తం 150 మార్కులకు 150​ ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్​, మ్యాథ్స్​, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల నుంచి.. బైపీసీ పరీక్షకు ఇంగ్లిష్​, బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల నుంచి.. ఎంఈసీ పరీక్షకు ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​, గణితం సబ్జెక్టుల నుంచి పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు లేదా ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టీజీఆర్‌జేసీ సెట్- 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో