APPSC Group 2 Mains Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు అలర్ట్.. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎప్పుడంటే?
ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలను తాజాగా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఫలితాలను ఈ కింది డౌరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు..

అమరావతి, ఏప్రిల్ 5: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొత్తం 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలను తాజాగా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు.
గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ APPSC కార్యాలయంలో నిర్వహించబడుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రొవిజనల్ లిస్టులోని అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాలి. ఏయే పత్రాలు తమతో తీసుకెళ్లాలంటే..
- ఏజ్ ప్రూఫ్ లేదా వయస్సు సడలింపు ప్రూఫ్ సర్టిఫికెట్
- విద్యా అర్హతలు
- స్టడీ సర్టిఫికెట్లు
- ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ (రిజర్వ్ చేయబడిన అభ్యర్థులకు)
- నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థులకు రెవెన్యూ అధికారులు అందించే పత్రం)
- ఆదాయం & ఆస్తి సర్టిఫికేట్ (EWS క్లెయిమ్ చేసే అభ్యర్థుల కోసం)
- స్థానిక స్థితి ధృవీకరణ పత్రం (తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు వలస వెళ్లిన వారి కోసం)
- స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ (స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులకు)
- మాజీ సైనికులు, PWD సర్టిఫికెట్లు (వర్తిస్తే)
సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అవసరమైన ఒరిజినల్ పత్రాలను సమర్పించడంలో విఫలమైతే సదరు అభ్యర్థి అనర్హులుగా పరిగణించబడతారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిపే చిరునామా ఇదే..
కొత్త HODs భవనం, 2వ అంతస్తు, MG రోడ్డు, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – 520010
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.