TG High Court Exam Dates: తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో మొత్తం 1673 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను తాజాగా హైకోర్టు విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో..

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో మొత్తం 1673 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను తాజాగా హైకోర్టు విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో షిఫ్టుల వారీగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ కింద ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, సబ్-ఆర్డినేట్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఏ పరీక్ష ఎప్పుడంటే..
- ఎగ్జామినర్ పరీక్ష తేదీ: 2025 ఏప్రిల్ 15
- జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 16
- ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20
- రికార్డ్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20
- కాపీయిస్ట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15
- టైపిస్ట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15
ఏపీలోని కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11వ తరగతులకు, 7,8,9,10,12వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హులైన వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 17 నుంచి టీటీసీ శిక్షణ కోర్సుకు దరఖాస్తులు స్వీకరణ
తెలంగాణ రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి జూన్ 11 వరకు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) వేసవి శిక్షణ కోర్సును నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఈ కోర్సును నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.