TGPSC Group 1 Hall Tickets: రేపే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షలు ఎప్పటినుంచంటే

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్ పరీక్షల హాల్‌ టికెట్లు రేపట్నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన కమిషన్‌.. అక్టోబర్ 14 నుంచి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధులందరూ..

TGPSC Group 1 Hall Tickets: రేపే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షలు ఎప్పటినుంచంటే
TGPSC Group 1
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 13, 2024 | 7:52 AM

హైదారబాద్‌, అక్టోబర్‌ 13: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్ పరీక్షల హాల్‌ టికెట్లు రేపట్నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన కమిషన్‌.. అక్టోబర్ 14 నుంచి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధులందరూ తమ వివరాలను నమోదు చేసి, వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్‌ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా టీజీపీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలి. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు హైదరాబాద్‌ పరిధిలో జరుగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్‌ 1 ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. మెయిన్స్‌ పరీక్షలు 7 పేపర్లకు జరుగుతాయి.

అక్టోబర్‌ 15, 16 తేదీల్లో ఐసెట్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి అక్టోబర్‌ 15, 16 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మిగిలి పోయిన సీట్ల వివరాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచామని, ప్రాధాన్యాల వారీగా ప్రవేశాలు పొందవచ్చని కన్వీనర్‌ ఎ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.

‘మార్కుల విషయంలో పిల్లలపై ఒత్తిడి వద్దు’.. మంత్రి సవిత

చదువుకునే పిల్లలపై మార్కుల విషయంలో తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. పిలలను చదువుతోపాటు ఆటపాటల్లో కూడా రాణించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన పిల్లలు ప్రాతినిధ్యం వహించే స్థాయికి వారిని తీర్చిదిద్దాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి సవిత ఈ మేరకు సూచించారు. ఎన్డీయే ప్రభుత్వం బీసీల సంక్షేమంతోపాటు విద్యార్థుల భవితకు పెద్దపీట వేస్తోందని అన్నారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి కూడా నివేదిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.