AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS to Vizag: ‘విశాఖకు టీసీఎస్‌.. 10 వేల మందికి ఉపాధి అవకాశాలు..’ మంత్రి లోకేశ్‌ ప్రకటన

విశాఖపట్నానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏర్పాటు కానున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. విశాఖపట్నంలో భారీగా పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఈవీ, ఏరోస్పేస్‌, పర్యాటక, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని గతంలోనే టాటా గ్రూపు తెలిపింది..

TCS to Vizag: 'విశాఖకు టీసీఎస్‌.. 10 వేల మందికి ఉపాధి అవకాశాలు..' మంత్రి లోకేశ్‌ ప్రకటన
TCS To Visakhapatnam
Srilakshmi C
|

Updated on: Oct 13, 2024 | 9:17 AM

Share

అమరావతి, అక్టోబర్‌ 13: విశాఖపట్నానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏర్పాటు కానున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. విశాఖపట్నంలో భారీగా పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఈవీ, ఏరోస్పేస్‌, పర్యాటక, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని గతంలోనే టాటా గ్రూపు తెలిపింది. ఈ క్రమంలో ఇటీవల టాటా గ్రూపు ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్‌ ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ రంగం, ఇతర రంగాల్లో అభివృద్ధిపై ప్రజెంటేషన్‌ ఇచ్చిన లోకేష్‌.. ఆనంతరం బిగ్ అనౌన్స్‌ మెంట్‌ ఉంటుందని తన ఎక్స్ ఖాతాలో లోకేశ్ ప్రకటించారు. అనంతరం 24 గంటల్లోపే విశాఖ సాగర తీరంలో టీసీఎస్‌ ఏర్పాటు ఖాయం అయినట్లు వెల్లడించారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ క్రమంగా గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే విశాఖపట్నంలో లులు, ఒబెరాయ్‌, బ్రూక్‌ఫీల్డ్‌, సుజలాన్‌ వంటి సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా టీసీఎస్‌ వస్తుండటంతో ప్రముఖ కంపెనీల పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారుతోందనడంలో సందేహం లేదన్నారు. ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. ఈ నినాదం ద్వారా పెట్టుబడులకు అత్యుత్తమ వాతావరణాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బిజినెస్‌ చేసేందుకు ఏపీని దేశంలోనే నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో టీసీఎస్‌ పెట్టుబడిని ముఖ్యమైన మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. విశాఖ ఐటీ హబ్‌గా రూపురేఖలు మార్చుకోనుందని, దానికి టీసీఎస్‌ మణిహారంగా మారుతుందని ఐటీ వర్గాలు సైతం చెప్పడం విశేషం.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో గ్రూప్‌ 3 పరీక్షల తేదీలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల కమిషన్‌ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌తోపాటు మోడల్‌ ఆన్సర్‌ బుక్‌లెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.