TGPSC Group 2 Exam Postponement: ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి వాయిదాకు సిద్ధపడుతున్న గ్రూప్‌ 2 పరీక్ష.. కారణం ఇదే

తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష నాలుగో సారి వాయిదా దిశగా అడుగు వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం.. సరిగ్గా అదే రోజు మరో కీలక నియామక పరీక్ష ఉండటమే. దీంతో అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ టీజీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా వేయకుంటే తమగతేంగానూ అంటూ వాపోతున్నారు..

TGPSC Group 2 Exam Postponement: ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి వాయిదాకు సిద్ధపడుతున్న గ్రూప్‌ 2 పరీక్ష.. కారణం ఇదే
TGPSC Group 2 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 24, 2024 | 2:37 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 24: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష బాలారిష్టాలు దాటుకునేదెప్పుడో అర్ధంకాకున్నది. ఇప్పటికే వరుసగా మూడు సార్లు వాయిదా పడిన గ్రూప్‌ 2 పరీక్ష.. మరోమారు వాయిదాపడే అవకాశం దండిగా ఉంది. అందుకు కారణం.. సరిగ్గా అదే రోజు మరో పరీక్ష కూడా ఉండటమే. అవును.. గ్రూప్‌ 2కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌ 1, 3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్‌ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే గ్రూప్‌-2 సర్వీసు పరీక్ష తేదీనే రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(RRB) పరీక్షనూ నిర్వహిస్తోంది. ఒకే రోజు ఈ రెండు పరీక్షల నిర్వహణ ఉండటంతో ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు గందరగోళ పడుతున్నారు.

డిసెంబర్‌ 15, 16న గ్రూప్‌-2 పరీక్షలు ఉండగా.. ఆర్‌ఆర్‌బీ జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష డిసెంబర్‌ 16న జరగనుంది. గ్రూప్‌ 2కు హాజరయ్యే అభ్యర్థుల్లో కొందరు ఆర్‌ఆర్‌బీ జేఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ రెండు పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సి పరిస్థితి నెలకొంది. అభ్యర్ధులు మాత్రం రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని అటు రైల్వే శాఖకు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెడుతున్నారు.

ఇదిలా ఉంటే టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్‌ 9 నుంచి విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తం 18 విభాగాల్లో 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?