TG DSC 2024 Result Date: తెలంగాణ డీఎస్సీ రిజల్ట్స్‌ వచ్చేస్తున్నాయ్..! తుది ఆన్సర్ కీపై విద్యాశాఖ కీలక అప్‌డేట్

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) 2024 పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎస్సీ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక ఆన్సర్‌ కీ కూడా విడుదలైంది. ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఎన్నడూలేనిది ఈ సారి ఏకంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి..

TG DSC 2024 Result Date: తెలంగాణ డీఎస్సీ రిజల్ట్స్‌ వచ్చేస్తున్నాయ్..! తుది ఆన్సర్ కీపై విద్యాశాఖ కీలక అప్‌డేట్
TG DSC 2024 Result Date
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2024 | 7:08 AM

హైదరాబాద్‌, ఆగస్టు 25: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) 2024 పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎస్సీ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక ఆన్సర్‌ కీ కూడా విడుదలైంది. ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఎన్నడూలేనిది ఈ సారి ఏకంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్ధులు ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా.. అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అధికారులు తీపికబురు చెప్పారు. డీఎస్సీ రాత పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడుల్లో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

డీఎస్సీలో అడిగిన ప్రశ్నలపై వచ్చిన 28 వేలకుపైగా అభ్యంతరాలు పరిశీలించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీని విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో ప్రశ్నపై పలువురు అభ్యంతరం తెలపడంతో వాటి సంఖ్య వేలల్లో ఉందని, సబ్జెక్టు నిపుణుల పరిశీలన అనంతరం ఆగస్టు నెలాఖరులో తుది ఆన్సర్‌ కీ వెల్లడిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నెలలో జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారు. ఈ మేరకు మెరిట్‌ జాబితా జారీ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

AP RGUKT ట్రిపుల్‌ఐటీ ఫేజ్-3 సెలక్షన్‌ రిజల్ట్స్‌ విడుదల.. ఆగస్టు 29న కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-3 సెలక్షన్‌ లిస్ట్‌ విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆగస్టు 29వ తేదీన ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, జనరల్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరవ్వాలని ఆర్జీయూకేటీ పేర్కొంది. క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. ఫేజ్-3 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.