TS Inter: తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్‌… ఉచిత వసతి, భోజనం, నీట్, ఐఐటీ కోచింగ్‌.. పూర్తి వివరాలు

పదో తరగతిలో మంచి ప్రతిభ కనబరిచి ఆర్థిక స్థోమత సహకరించని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా ఉచితంగా విద్య, వసతి సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే 2023- 24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 గిరిజన గురుకుల జానియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్..

TS Inter: తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్‌... ఉచిత వసతి, భోజనం, నీట్, ఐఐటీ కోచింగ్‌.. పూర్తి వివరాలు
Telangana Tribal Welfare
Follow us

|

Updated on: Jun 02, 2023 | 6:05 PM

పదో తరగతిలో మంచి ప్రతిభ కనబరిచి ఆర్థిక స్థోమత సహకరించని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా ఉచితంగా విద్య, వసతి సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే 2023- 24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 గిరిజన గురుకుల జానియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌ రెండేళ్లు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు సైతం శిక్షణ అందిస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎప్పుడు చివరి తేదీలాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఇంటర్‌ 2023-24 విద్యా సంవత్సరానికి గాను టీటీడబ్ల్యఆర్‌జేసీ /టీటీడబ్ల్యూయూఆర్‌జేసీలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ కోర్సులను ఎంచుకోవచ్చు. ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధన ఉంటుంది. ఇక ఈ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మార్చి 2023లో పదో తరగతి ఉత్తీ్ర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో అయితే రూ. 2 లక్షలు, గ్రామాల్లో అయితే రూ. 1,50,000 మించకూడదు.

విద్యార్థులను పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..