TS 10th Class Results: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి.. టీవీ9 వెబ్‌సైట్‌లో ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి..
Telangana 10th Class Results: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా విద్యార్థుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ గురువారం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు...
Telangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా విద్యార్థుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ గురువారం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను నేరుగా TV9 Telugu వెబ్‌సైట్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..
ఎంత మంది పాస్ అయ్యారంటే..
ఈ ఏడాది మొత్తం 5,03,579 విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకాగా 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 90 శాతం మంది ఉత్తీర్ణత శాతం సాధించారు. వీరిలో అబ్బాయిలు 2,55,433 అబ్బాయిలు హాజరుకాగా 2,23,779 (87.61 శాతం) మంది పాస్ అయ్యారు. 2,48,146 అమ్మాయిలు 2,29,422 (92.45) మంది ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థులు అధైర్య పడొద్దు..
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఉత్తీర్ణత సాధించని వారికోసం స్పెషల్ క్లాసెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సున్నా, 1 మార్కుల విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మరోసారి వెరిఫికేషన్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక విద్యార్థులు కూడా అధైర్య పడొద్దని, కష్టపడి సప్లీలు రాసుకోవాలని సూచించారు. ఓటమి గెలుపునకు తొలి మెట్టు అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం, పేరెంట్స్, టీచర్లు విద్యార్థుల వెనకా ఉన్నారని ధైర్యం నూరిపోశారు.
గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా ఉత్తీర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి యథావిథిగా పరీక్షలను నిర్వహించారు. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతో 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మొత్తం 4,53,201 మంది ఉత్తీర్ణ సాధించారు. గతేడాదిలాగే ఈ సారి కూడా అమ్మాయిల హవానే కొనసాగింది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..