AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana SSC Results 2022: పది ఫలితాల్లో బాలికలదే పై చేయి.. అత్యధిక ఉత్తీర్ణతతో మెరిసిన అమ్మాయిలు..

ఈ ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదిలాగే ఈ సారి కూడా అమ్మాయిల హవానే కొనసాగింది. అత్యధికమంది బాలికలే ఉత్తీర్ణత సాధించారు.

Telangana SSC Results 2022: పది ఫలితాల్లో బాలికలదే పై చేయి.. అత్యధిక ఉత్తీర్ణతతో మెరిసిన అమ్మాయిలు..
TS Inter Supply Results
Shaik Madar Saheb
|

Updated on: Jun 30, 2022 | 11:59 AM

Share

Telangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో కూడా బాలికలే సత్తాచాటారు. మొత్తం మీద 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఫలితాలను నేరుగా TV9 Telugu వెబ్‌సైట్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా ఉత్తీర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి యథావిథిగా పరీక్షలను నిర్వహించారు. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతో 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదిలాగే ఈ సారి కూడా అమ్మాయిల హవానే కొనసాగింది. అత్యధికమంది బాలికలే ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఏడాది మొత్తం 5,03,579 విద్యార్థులు టెన్త్‌ పరీక్షలకు హాజరుకాగా 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 90 శాతం మంది ఉత్తీర్ణత శాతం సాధించారు.

ఇవి కూడా చదవండి

పదోతరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం..

  • బాలికలు పరీక్షలకు 2,48,146 మంది హాజరుకాగా.. 22,9422 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 92.45 శాతంగా ఉంది.
  • బాలురు పరీక్షలకు 255433 మంది హాజరుకాగా.. 223779 మంది పాసయ్యారు. బాలుర మొత్తం ఉత్తీర్ణత శాతం 87.61.
  • బాలురు బాలికల మొత్తం ఉత్తీర్ణత శాతం 90శాతం ఉంది.
  • బాలికలు.. బాలుర కంటే.. 12.55 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
  • ప్రైవేట్ సెక్టార్ లో 51.89శాతం.
  • తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
  • హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది.