TS Inter Supply 2024 Hall Ticket: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు స్కోర్ చేసిన విద్యార్ధులు కూడా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. వీరంతా పరీక్ష ఫీజు చెల్లించినట్లైతే పరీక్షలకు హాజరుకావచ్చు..
హైదరాబాద్, మే 19: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు స్కోర్ చేసిన విద్యార్ధులు కూడా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. వీరంతా పరీక్ష ఫీజు చెల్లించినట్లైతే పరీక్షలకు హాజరుకావచ్చు. ఫీజు చెల్లించిన వారంతా ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఆయా తేదీల్లో ప్రతి రోజూ రెండు పూటలా పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఇక ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 11న ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12వ తేదీన జరుగుతుంది.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
APPSC DEO పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో జరిగే ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 25 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
APPSC DEO పరీక్ష హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.