TS Inter Exam: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫీజు గడువు పెంచుతూ నిర్ణయం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
TS Inter Exam: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు గడువును పెంచుతూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫీజులు చెల్లించే గడువును ఫిబ్రవరి 4 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఫైన్‌తో ఫీజు...
TS Inter Exam: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు గడువును పెంచుతూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫీజులు చెల్లించే గడువును ఫిబ్రవరి 4 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఫైన్‌తో ఫీజు చెల్లించే వారు ఫిబ్రవరి 24 వరకు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇక మొదట ఏడాది ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా ఈ చివరి తేదీలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
నిజానికి ఇంటర్ పరీక్షల ఫీజు చివరి తేదీ జనవరి 5తో ముగియాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను జనవరి ఆఖరు వరకు పొడిగించిన.. నేపథ్యంలో ఫీజు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రూ. 200 ఫైన్‌తో ఫీజు చెల్లించే వారికి ఫిబ్రవరి 10, రూ. 1000 ఫైన్‌తో ఫీజు చెల్లించాలనుకునే వారికి ఫిబ్రవరి 17, రూ. 2 వేల ఫైన్‌తో ఫీజు చెల్లించే వారికి ఫిబ్రవరి 24 చివరి తేదీగా నిర్ణయించారు. ఇక తెలంగాణ ఇంటర్ ఈ బోర్డ్ ఈ ఏడాది పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Also Read: Priyanka Gandhi: యూపీలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు? ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ప్రియాంక
F3 Movie: వెంకీ, వరుణ్ ఎఫ్ 3 కు ఇప్పట్లో మోక్షం లేనట్టేనా.. మరోసారి వాయిదా తప్పదా..?
Sourav Ganguly vs Virat: ఆ వార్తలో నిజం లేదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ..