Indian Navy: ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇండియ‌న్ నేవీ ఆహ్వానం.. బీటెక్ డిగ్రీతో పాటు ఉద్యోగం..

Indian Navy: ఇంట‌ర్ పూర్తి చేసిన వారికి ఇండియ‌న్ నేవీ శుభ‌వార్త తెలిపింది. ఇండియ‌న్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్‌ కమిషన్‌) కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది...

Indian Navy: ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇండియ‌న్ నేవీ ఆహ్వానం.. బీటెక్ డిగ్రీతో పాటు ఉద్యోగం..
Follow us

|

Updated on: Jan 22, 2022 | 5:31 PM

Indian Navy Recruitment: ఇంట‌ర్ పూర్తి చేసిన వారికి ఇండియ‌న్ నేవీ శుభ‌వార్త తెలిపింది. ఇండియ‌న్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్‌ కమిషన్‌) కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఇందులో ఎంపికైన విద్యార్థుల‌కు బీటెక్ డిగ్రీతో పాటు ఉద్యోగం క‌ల్పిస్తారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాలు మీ కోసం…

భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) కింద ఈ సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* మొత్తం 35 ఖాళీల‌కు గాను ఎడ్యుకేష‌న్ బ్రాంచ్లో 05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నిక‌ల్ బ్రాంచ్‌లో 30 ఖాళీలు ఉన్నాయి.

* వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు 70శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (10+2) (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అలాగే జేఈఈ మెయిన్-2021కు హాజరై ఉండాలి వీటితో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

* విద్యార్థుల వ‌య‌సు 02-01-2003 నుంచి 01-07-2005 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను మొద‌ట జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా మెరిట్‌ ర్యాంకు ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 27-01-2022న ప్రారంభ‌మ‌వుతుండ‌గా, 08-02-2022తో ముగియ‌నుంది.

* ఇంట‌ర్వ్యూల‌ను మార్చి-ఏప్రిల్ 2022న నిర్వ‌హిస్తారు. కోర్సు 2022 జూలై నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే

Crime News: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్! బాటసారులను అడవిలోకి లాక్కెళ్లి..

IPL 2022 Mega Auction: షమీ నుంచి బౌల్ట్ వరకు.. వేలంలో కాసుల వర్షం కురిపించే బౌలర్లు ఎవరంటే?