Telugu News » Photo gallery » Cricket photos » These top 5 bowlers highest price in Indian Premier League 2022 mega Auction; mohammed shami to trent boult check the full list
IPL 2022 Mega Auction: షమీ నుంచి బౌల్ట్ వరకు.. వేలంలో కాసుల వర్షం కురిపించే బౌలర్లు ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022) తదుపరి సీజన్ మెగా వేలం వచ్చే నెలలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈసారి చాలా మంది బౌలర్లపై కనక వర్షం కురవనుంది. అందులో టాప్ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
మహ్మద్ షమీ: భారత ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా ఈసారి వేలంలో భాగమయ్యాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేయలేదు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో షమీ దిట్ట. దీంతో అన్ని జట్లు షమీపై కన్నేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెగా వేలంలో షమీకి భారీ మొత్తం దక్కవచ్చు.
2 / 6
క్రిస్ మోరిస్: IPL 2021 వేలంలో, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వేలంలో అత్యధికంగా అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. ఈసారి కూడా వేలంలో మోరిస్‌పై కనక వర్షం కురిపించవచ్చు.
3 / 6
కగిసో రబాడా: దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చాలా కాలం పాటు అద్భుత ప్రదర్శన చేశాడు. అయినా ఢిల్లీ అతనిని రాబోయే సీజన్‌లో ఉంచుకోలేదు. రబాడా డబ్బు సంపాదించడానికి ఇదో మంచి అవకాశం. ఎందుకంటే వేలంలో అన్ని జట్లు రబాడాను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాయి.
4 / 6
జోష్ హాజిల్‌వుడ్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈసారి వేలంలో భాగమయ్యాడు. హేజిల్‌వుడ్ వేలంలో కూడా పెద్ద మొత్తంలో పొందవచ్చు.
5 / 6
7. ట్రెంట్ బౌల్ట్: ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ IPL 2022 వేలంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. ఎడమచేతి వాటం పేసర్ పవర్‌ప్లేలో ముందుగా వికెట్లు తీయడంలో నైపుణ్యం కలిగి ఉంటాడు. ముంబై ఇండియన్స్ అతనిని తిరిగి కొనుగోలు చేయడం, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పేస్ బౌలింగ్ దాడిని రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.