TG Inter Revaluation Results 2024: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల 2024 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు కొందరు విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. అందుకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్ నంబర్ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవచ్చు..
హైదరాబాద్, మే 20: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల 2024 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు కొందరు విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. అందుకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్ నంబర్ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. తొలుత జరిగిన మూల్యాంకనంలో ఏవైనా పొరబాట్లు జరిగినట్లు గుర్తిస్తే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌లో మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎలాంటి పొరబాట్లు జరగకుండా యథతథంగా ఉంటే తొలుత ప్రకటించిన మార్కులనే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకుంటారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇకపోతే ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఆయా తేదీల్లో ప్రతి రోజూ రెండు పూటలా పరీక్షలు జరుగనున్నాయి. ఫస్టియర్ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయి.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.