Telangana: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పనున్న ఉన్నత విద్యామండలి!.. ఎంసెట్‌ అర్హత విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!..

కరోనా (Corona) మహమ్మారి కారణంగా గత రెండేళ్లు విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయారు. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైనా సరిగా బుర్రకెక్కించుకోలేకపోయారు.

Telangana: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పనున్న ఉన్నత విద్యామండలి!.. ఎంసెట్‌ అర్హత విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!..
Inter Students
Follow us
Basha Shek

| Edited By: Phani CH

Updated on: Mar 06, 2022 | 7:51 AM

కరోనా (Corona) మహమ్మారి కారణంగా గత రెండేళ్లు విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయారు. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైనా సరిగా బుర్రకెక్కించుకోలేకపోయారు. దీని కారణంగానే గతేడాది అక్టోబర్‌లో ఇంటర్మీడియెట్ (Intermediate) ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. కేవలం 49 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులు అయ్యారు. పాస్‌ కాలేని కొందరు విద్యార్థులు అవమానంగా ఫీలై ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దీంతో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వీరంతా ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఇంటర్‌ ఫస్టియర్ అనుభవాల నేపథ్యంలో ఈసారి కూడా ఎక్కువమంది విద్యార్థులు 40 మార్కులు సాధించడం కష్టమనే భావన బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో కనీసం పాస్ మార్కులు తెచ్చుకున్నవారిని ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలనే ఆలోచనలో ఉంది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్ష రాసే విద్యార్థులందరికీ ఎంసెట్‌కు అర్హత లభించనుంది. త్వరలోనే ఉన్నత విద్యా మండలి దీనికి సంబంధించి కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

వారికి ప్రయోజనం చేకూర్చేలా..

సాధారణంగా ఇంటర్మీడియెట్‌లో కనీసం 40 శాతం మార్కులు వచ్చిన వారికే ఎంసెట్లో ర్యాంకులు కేటాయిస్తారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాన్ని దృష్టిలో కనీసం పాస్ మార్కులు తెచ్చుకున్నవారిని ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇక ఈ ఏడాది ఎంసెట్ 2022 పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 7న జరిగే సమావేశంలో దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు, సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also Read:State Bank of India: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే..

Tamilisai: శాసనసభ్యులు ఆ హక్కును కోల్పోయినట్లే.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై స్పందించిన తమిళి సై..

Chiranjeevi: ఊరమాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లకే ఓటేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు పూనకాలే..