BOB Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
BOB Recruitment 2022: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 7...
BOB Recruitment 2022: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 7 (సోమవారం)తో గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాడక్ట్ హెడ్ (01), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (03), సీనియర్ మేనేజర్ (03), మేనేజర్ (03) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత విభాగాంలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా తుది నిర్ణయం ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 07-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: అర్ధరాత్రి పిల్లలు ఇంటర్నెట్ వాడుతున్నారని.. ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే !! వీడియో
Manipur Elections: మణిపూర్‌లో ముగిసిన తుది విడత పోలింగ్.. పలుచోట్ల హింసాత్మక ఘటనలు!