Attention! SSC CHSL 2022 కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? మరి కొన్ని గంటల్లో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL)కు దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఒక్క రోజే మిగిలుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు..
SSC CHSL Recruitment 2022 last date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL)కు దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఒక్క రోజే మిగిలుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఈ నెల (మార్చి) 7తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. దరఖాస్తు రుసుమును చెల్లించడానికి మార్చి 8 గడువు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే తక్షణమే అప్లై చేసుకోవల్సిందిగా కమిషన్ సూచించింది. అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులను పూరించవల్సిందిగా తెల్పింది. కాగా ఎస్సెస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్ష ద్వారా కమీషన్ లోయర్ డివిజనల్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ / ట్రిబ్యునల్ మొదలైన పోస్టులను వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / భారత ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ రాజ్యాంగ సంస్థలకు / చట్టబద్ధమైన సంస్థల్లోని ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కాగా ఈ నోటిఫికేసన్‌లో మొత్తం ఖాళీల వివరాలు ఎస్సెస్సీ ఇంకా విడుదల చేయలేదు. త్వరలో విడుదల చేయనున్నట్లు తెల్పింది. ఎస్సెస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్ నియామకాలను మొత్తం మూడు పద్ధతుల్లో భర్తీ చేస్తారు. టైర్-1, టైర్-2, స్కిల్ టెస్ట్/కంప్యూటర్ టైపింగ్ టెస్ట్.. ఈ మూడు దశల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7, 2022వరకు కొనసాగుతుంది.
- ఆన్‌లైన్ ఫీజు చెల్లిండానికి చివరితేదీ: మార్చి 8, 2022.
- టైర్1 పరీక్షను 2022 మేలో నిర్వహిస్తారు. టైర్2 తేదీ ఇంకా ప్రకటించలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Also Read: