TG Anganwadi Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో 11 వేల అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది. దాదాపు 11 వేల అంగన్‌వాడీ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే..

TG Anganwadi Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో 11 వేల అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌
TG Anganwadi jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 23, 2024 | 7:51 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది. దాదాపు 11 వేల అంగన్‌వాడీ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే (నర్సరీ) స్కూళ్లు ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35,700 వేల అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. వాటిల్లో కొత్తగా 15 వేల వరకు నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామని గతంలో మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు త్వరలో నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉంది.

మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్‌, మినీ అంగన్‌వాడీ టీచర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు.టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్యేవారు కనీసం పదోతరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవాలంటే జనరల్‌, బీసీ అభ్యర్థుల వయసు 21 నుంచి 35 వరకు వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగి వివాహిత మహిళలు మత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎంపికై అంగన్‌వాడీ టీచర్‌లకు నెలకు రూ.12,500 నుంచి రూ.13,500 వరకు జీతంగా చెల్లిస్తారు. హెల్పర్‌కు రూ.8,000 జీతంగా చెల్లిస్తారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత వివరంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తుది నిర్ణయం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.