Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Based Digital Education: ఇక సర్కార్ బడుల్లో ఏఐ క్లాస్‌లు.. 6 నెలల్లో విద్యాశాఖ అమలు!

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య, ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలు, కృత్రిమ మేధస్సును ఉపయోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని బృందం, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ EV నరసింహా రెడ్డి గురువారం బెంగళూరులో EkStep ఫౌండేషన్‌ను సందర్శించారు..

AI Based Digital Education: ఇక సర్కార్ బడుల్లో ఏఐ క్లాస్‌లు.. 6 నెలల్లో విద్యాశాఖ అమలు!
AI Based Digital Education in Telangana
Follow us
Prabhakar M

| Edited By: Srilakshmi C

Updated on: Jan 31, 2025 | 1:31 PM

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ పద్ధతులను విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, పాఠశాల విద్యా శాఖ ఆధునిక విద్యా విధానాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా బెంగుళూరు కేంద్రంగా పని చేసే ఎక్ స్టెప్ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ ఫౌండేషన్ విద్యా రంగంలో డిజిటల్ పరిష్కారాలను అందిస్తూ గుజరాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కలిసి ఇప్పటికే పనిచేస్తున్నట్లు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తెలిపారు.

తెలంగాణ ప్రతినిధుల ఎక్ స్టెప్ ఫౌండేషన్ సందర్శన

జనవరి 30న రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎక్ స్టెప్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించింది. బృందంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా AI ఆధారిత డిజిటల్ విద్యా విధానాలు, పాఠశాల విద్యలో నూతన అభ్యాస పద్ధతులు, డేటా ఆధారిత అధ్యయన విశ్లేషణలు, ఉపాధ్యాయుల శిక్షణా విధానాలు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ఈ మేరకు పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తుంది. మరింత నాణ్యతా ప్రమాణాలతో పాఠశాల విద్యను అందించడానికి ఏఐ, డిజిటల్ ఇన్షియేటివ్స్  ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

AI ఆధారిత డిజిటల్ విద్యలో కీలక అంశాలు

తెలంగాణలో ఎక్ స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమలు చేయనున్న విద్యా ఆధునికీకరణలో ముఖ్య అంశాలు ఇవే..

ఇవి కూడా చదవండి
  • ఫౌండేషనల్ లిటరసీ, న్యూమెరసీ (FLN): ప్రాథమిక విద్యా స్థాయిలో AI ఆధారిత టూల్స్ ద్వారా పిల్లల్లో రాయడం, చదవడం, సంఖ్యా విజ్ఞానం పెంపొందించడం.
  • AI-Powered Digital Learning: AI ఆధారిత విద్యా ప్లాట్‌ఫార్మ్‌లు, పర్సనలైజ్డ్ లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల అభ్యాస పద్ధతులను మెరుగుపరచడం.
  • Data-Driven Insights: విద్యార్థులలోని బలహీనతలను గుర్తించి, కస్టమైజ్డ్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా అభ్యాసంలో మెరుగుదల సాధించడం.
  • ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి: డిజిటల్ టూల్స్ వినియోగంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించడం, నూతన విద్యా విధానాలను అందిపుచ్చుకునేలా చేయడం.

కేరళ విద్యా మోడల్ నుంచి ప్రేరణ

తెలంగాణ ప్రతినిధి బృందం ఇటీవల కేరళ రాష్ట్రాన్ని సందర్శించి, అక్కడి AI ఆధారిత విద్యా విధానాలను అధ్యయనం చేసింది. కేరళ ప్రభుత్వం అమలు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ తెలంగాణలో కూడా అనుసరించాలనే ప్రణాళిక రూపొందించబడింది.

ముందుకు తెలంగాణ విద్యా రంగం

AI ఆధారిత డిజిటల్ విద్యా విధానాలు ప్రవేశపెట్టేందుకు సమగ్ర ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తోంది. విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపు, ఉపాధ్యాయులకు శిక్షణ, స్నేహపూర్వక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లతో విద్యా రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.