Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PwD Reservation in Higher Education: ఇకపై ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం బెంచ్ మార్క్ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. అలాగే వికలాంగులకు ఉన్నత విద్యలో ప్రవేశానికి ఐదేళ్ల గరిష్ట వయో సడలింపు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

PwD Reservation in Higher Education: ఇకపై ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
PwD Reservation in TG
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2025 | 6:33 AM

హైదరాబాద్‌, జనవరి 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ఠ వయోపరిమితిలోనూ ఐదేళ్ల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. దివ్యాంగులను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్‌ అమలు చేయనుంది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఇతర సంస్థలు బెంచ్‌మార్క్ వికలాంగులకు 5 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని ఆదేశించారు. తెలంగాణ వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు అంటే నిర్దేశిత వైకల్యంలో 40 లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉన్న వ్యక్తి అని అర్ధం.

దివ్యాంగుల ఐదు కేటగిరీలు ఇవే..

  • దృష్టి లోపం ఉంటే.. ఏ కేటగిరీ
  • వినికిడి లోపం, మూగ ఉంటే.. బీ కేటగిరీ
  • అంగవైకల్యం ఉంటే.. సీ
  • మానసిక వైకల్యం ఉంటే.. డీ
  • ఒకటికి మించిన వైకల్యాలు ఉంటే.. ఈ

ఈ విధంగా ఐదు కేటగిరీలుగా విభజించింది. ఈ కేటగిరీల అభ్యర్థులకు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. ఈ రిజర్వేషన్‌ రొటేషన్‌ కింద కొనసాగుతుంది. అంటే.. ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థికి ఆ అవకాశం కల్పిస్తారు. ప్రవేశాల్లో దివ్యాంగ అభ్యర్థులెవ్వరూ లేకుంటే.. ఆ ఖాళీలను సంబంధిత ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడు వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్‌ మేరకు భర్తీ చేస్తారు. ఈ మేరకు దివ్యాంగుల రిజర్వేషన్‌ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.