AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG New DSC Notification: జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికషన్‌.. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవే

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు త్వరలో మరో డీఎస్సీ విడుదల చేస్తామని రేవంత్‌ సర్కార్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో లేదంటే ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 11,062 పోస్టులకు డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. రేపట్నుంచి ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని..

TG New DSC Notification: జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికషన్‌.. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇవే
TG DSC Exam
Srilakshmi C
|

Updated on: Jul 17, 2024 | 8:29 AM

Share

హైదరాబాద్‌, జులై 17: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు త్వరలో మరో డీఎస్సీ విడుదల చేస్తామని రేవంత్‌ సర్కార్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో లేదంటే ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 11,062 పోస్టులకు డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. రేపట్నుంచి ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రటించింది. ఈ ప్రకటనలో మొత్తం 5 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇకపై ఏటా రెండుసార్లు టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని.. ఒకటి జూన్, మరొకటి డిసెంబరులో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీఓ జారీ చేసింది కూడా. ఆ ప్రకారంగా ఈ డిసెంబరులో టెట్‌ పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు కనీసం 45 రోజుల గడువు ఉంటుంది. అనంతరం జనవరి లేదా ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ మొత్తం ఖాళీల లెక్క..

తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. అందులో 10,449 మంది భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించారు. పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు వచ్చే అవకాశం లేదు. దీంతో మిగిలినవి 9,268 ఖాళీలు మాత్రమే. అయితే రాష్ట్రంలోని 1,739 ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఒక్క విద్యార్ధి కూడా లేకపోవడంతో.. వాటన్నింటినీ జీరో స్కూళ్లుగా మూసివేశారు. వాటిల్లో దాదాపు 2,000 మంది టీచర్లు వరకు ఉంటారు. అలాగే విద్యార్ధులులేని 32 ఉన్నత పాఠశాలల్లో 400 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు లేని 600 ప్రాథమికోన్నత పాఠశా(యూపీఎస్‌)లల్లో 2,000 నుంచి 2,400 మంది వరకు ఉపాధ్యాయులున్నారు.

ఇలా మొత్తం 4,400 నుంచి 4,800 వరకు ఉపాధ్యాయులు ఉండగా.. వీరందరినీ ఇతర పాఠశాలల్లో ఖాళీలను బట్టి బదిలీలపై పంపారు. వాటిని మినహాయిస్తే 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలు తేలినట్లు విద్యాశాఖ చెబుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200 నుంచి 300 మంది వరకు టీచర్లు పదవీ విరమణ పొందుతుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం 1,25,058 ఉండగా.. వీటిల్లో 1.03 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. జులై 18న ప్రారంభమయ్యే డీఎస్సీ ద్వారా 11,062 మంది కొత్త టీచర్లు భర్తీ అయితే.. మిగిలిన పోస్టులకు కొత్త డీఎస్సీకి నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.