Telangana: తెలంగాణలో ‘ప్రత్యేక విద్యా కమిషన్’ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతోపాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే్కంగా తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్‌తోపాటు విద్యా రంగాలలో నైపుణ్యం కలిగిన ముగ్గురు సభ్యులు..
హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతోపాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే్కంగా తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్‌తోపాటు విద్యా రంగాలలో నైపుణ్యం కలిగిన ముగ్గురు సభ్యులు, విభాగాధిపతి స్థాయి సభ్య కార్యదర్శి ఉంటారు. కమిషన్‌లోని నాన్-అఫీషియల్ సభ్యుల పదవీకాలం నియామకం తేదీ నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. కమిషన్ ఛైర్మన్, సభ్యులను త్వరలో నియమించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా విద్యాకమిషన్ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మారుతున్న విద్యారంగాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వానికి విధాన రూపకల్పనపై సలహాలు ఇవ్వడం, విద్యారంగంలో థింక్-ట్యాంక్‌గా పనిచేయడం, మేధోమథనం, ఆలోచనలు, ప్రయోగాత్మక అధ్యయనాల ద్వారా విలువను పెంచడం, పాలసీ నోట్స్, మార్గదర్శకాలు, నియమాలు, ఎక్స్‌పోజర్ సందర్శనలను సులభతరం చేయడం కమిషన్ ప్రధాన లక్ష్యంగా అవసరమైన విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
నేటి నుంచి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలు.. 9 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి మరోసారి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ నేటి (సెప్టెంబరు 4వ తేదీ) నుంచి ప్రారంభమై 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వీరందరికీ సెప్టెంబరు 11న సీట్ల కేటాయింపు ఉంటుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, చేసుకున్నా సీట్లు పొందని వారు మాత్రమే ఈ ప్రత్యేక విడతలో పాల్గొనేందుకు అర్హులని కన్వీనర్ లింబాద్రి వివరించారు.