Telangana: మరోసారి తెలంగాణ EAMCET Exam దరఖాస్తు గడువు పెంపు
Telangana EAMCET Exam: కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేశారు. తాజాగా తెలంగాణలో...
Telangana EAMCET Exam: కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేశారు. తాజాగా తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను సైతం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రభావం ఎంసెట్ పరీక్షపై కూడా పడింది. ప్రస్తుతం ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సార్లు దరఖాస్తు గడువును పెంచిన ప్రభుత్వం తాజాగా మరోసారి పొడగించింది. దరఖాస్తుల స్వీకరణ జూన్ 10 (గురువారం)తో ముగియనున్న నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 17-06-2021ని నిర్ణయించారు. ఈ విషయమై తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియను తొలుత మార్చి 20న ప్రారంభించి మే 18 చివరి తేదీగా ప్రకటించారు. ఇక ఎంసెట్ పరీక్షను జులై 5 నుంచి ప్రారభించనున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో దరఖాస్తుల చివరి తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. తొలుత మే 18 చివరి తేదీ అని ప్రకటించగా.. తర్వాత దానిని మే 26 వరకు పొడిగించారు. అనంతరం మే 26 నుంచి జూన్ 3 వరకు పొడిగించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వినతులు రావడంతో దరఖాస్తు గడువును మరో సారి జూన్ 10 వరకు పొడిగించారు. ఇక ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత మరోసారి.. దరఖాస్తు గడువును జున్ 17కు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
IDBI Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ఈ బ్యాంకుల్లో అత్యంత చౌక వడ్డీకే రుణాలు!
AP Corona Cases: ఏపీలో తగ్గిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..!