AP Corona Cases: ఏపీలో తగ్గిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 97,863 శాంపిల్స్ పరీక్షించగా, 8,110 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 97,863 శాంపిల్స్ పరీక్షించగా, 8,110 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఇప్పటివరకు 17,87,883 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు తాజాగా 12,981 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడటంతో.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 16,77,063కి చేరింది
నిన్న కరోనాతో పోరాడుతూ 67 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా చిత్తూరులో 11మంది చనిపోగా, పశ్చిమ గోదావరి 9, విశాఖపట్నం 7, తూర్పుగోదావరి 6, శ్రీకాకుళం 6, విజయనగరం 6, గుంటూరు 5, కర్నూలు 5, అనంతపురం 4, కృష్ణ 4, కడప 3, నెల్లూరులో ఒకరు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో 11,763మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా మరణాలు…
#COVIDUpdates: 10/06/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,84,988 పాజిటివ్ కేసు లకు గాను *16,74,168 మంది డిశ్చార్జ్ కాగా *11,763 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,057#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/yqY1dg75Wi
— ArogyaAndhra (@ArogyaAndhra) June 10, 2021
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. బుధవారం కరోనా బారిన పడి 6,148 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ప్రారంభం నాటినుంచి ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కాగా.. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 కి పెరగగా.. మరణాల సంఖ్య 3,59,676 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇదిలాఉంటే.. నిన్న ఈ మహమ్మారి నుంచి 1,51,367 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,76,55,493 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,67,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 23,90,58,360 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!
మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!