Weather Report: రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ
Weather Report: ఉత్తర అరేబియా సముద్రం, ముంబైతో సహా మొత్తం కొంకన్ మరియు అంతర్గత మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్..
Weather Report: ఉత్తర అరేబియా సముద్రం, ముంబైతో సహా మొత్తం కొంకన్ మరియు అంతర్గత మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య బంగాళాఖాతంలోని బెంగాల్, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రం మరియు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మొత్తం పశ్చిమ బెంగాల్, బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఉత్తర బంగాళాఖౄతం, పరిసరాల్లో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది.