TG Inter Board: ఇక ఇంటర్‌ బోర్డులోనూ ప్లేస్‌మెంట్‌ విభాగం.. ఏర్పాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

తెలంగాణ ఇంటర్‌ బోర్డులో త్వరలోనే అకడమిక్‌ గైడెన్స్, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ (ఏజీటీపీసీ) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డుకు అనుమతి ఇస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా తర్ఫీదు ఇవ్వడం, ఉద్యోగ మేళాలు..

TG Inter Board: ఇక ఇంటర్‌ బోర్డులోనూ ప్లేస్‌మెంట్‌ విభాగం.. ఏర్పాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
TG Inter Board
Follow us

|

Updated on: Sep 09, 2024 | 7:08 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9: తెలంగాణ ఇంటర్‌ బోర్డులో త్వరలోనే అకడమిక్‌ గైడెన్స్, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ (ఏజీటీపీసీ) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డుకు అనుమతి ఇస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా తర్ఫీదు ఇవ్వడం, ఉద్యోగ మేళాలు నిర్వహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెరిగేలా చర్యలు తీసుకోవడం వంటి పలు కార్యకలాపాలు చేపడతారు. తద్వారా విద్యార్ధుల్లో చదువుపట్ల ఆసక్తి, కెరీర్‌ పట్ల ఆత్మవిశ్వసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ సీపీగెట్‌ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వచ్చేశాయి.. సెప్టెంబరు 18 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌

తెలంగాణ సీపీగెట్‌ 2024 తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అలాట్‌మెంట్‌ అర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 13వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. సీపీగెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలతోపాటు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ వంటి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో మొత్తం 278 కాలేజీల్లో 42,192 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయని గతంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐ కోటాలో వ్యవసాయ కోర్సుల‌కు దరఖాస్తులు ఆహ్వానం

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ పరిధిలోని కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎన్‌ఆర్‌ఐ కోటాలో పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ ఓ ప్రకటనలో తెలియ జేసింది. ఎన్‌ఆర్‌ఐ కోటాలో 3 విద్యాసంవత్సరానికి గాను బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ సీపీగెట్‌ 2024 తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇక ఇంటర్‌ బోర్డులోనూ ప్లేస్‌మెంట్‌ విభాగం.. విద్యార్ధులకు పండగే!
ఇక ఇంటర్‌ బోర్డులోనూ ప్లేస్‌మెంట్‌ విభాగం.. విద్యార్ధులకు పండగే!
ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రిక్వెస్ట్ ఎలా పంపాలో తెలుసా?
ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రిక్వెస్ట్ ఎలా పంపాలో తెలుసా?
ఈ రోజు స్కంద షష్ఠి ఆరోగ్యం కోసం కార్తికేయుడిని ఎలా పూజించాలంటే
ఈ రోజు స్కంద షష్ఠి ఆరోగ్యం కోసం కార్తికేయుడిని ఎలా పూజించాలంటే
ఏపీ టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. మరో రెండు వారాల్లో హాల్‌టికెట్లు!
ఏపీ టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. మరో రెండు వారాల్లో హాల్‌టికెట్లు!
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశివారికి ఆటంకాలు తొలగిపోతాయ
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశివారికి ఆటంకాలు తొలగిపోతాయ
మహిళలకు శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?
మహిళలకు శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?
విద్యా సంస్థలకు అలర్ట్.. నేడు కూడా స్కూళ్లకు సెలవే!
విద్యా సంస్థలకు అలర్ట్.. నేడు కూడా స్కూళ్లకు సెలవే!
ఈ సౌండ్ బార్‌లతో ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్..!
ఈ సౌండ్ బార్‌లతో ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్..!
కొంపముంచిన క్రోమింగ్‌ ఛాలెంజ్‌.. 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు..
కొంపముంచిన క్రోమింగ్‌ ఛాలెంజ్‌.. 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు..
ఈ హీరోయిన్‏కు ఏమైంది.. ఒక్కసారిగా ఊహించని విధంగా..
ఈ హీరోయిన్‏కు ఏమైంది.. ఒక్కసారిగా ఊహించని విధంగా..