AP TET 2024 Hall Tickets: ఏపీ టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. మరో రెండు వారాల్లో హాల్‌టికెట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ..

AP TET 2024 Hall Tickets: ఏపీ టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. మరో రెండు వారాల్లో హాల్‌టికెట్లు విడుదల!
AP TET 2024 Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 09, 2024 | 6:39 AM

అమరావతి, సెప్టెంబర్‌ 9: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక హాల్‌ టికెట్లు సెప్టెంబర్‌ 22వ తేదీ తర్వాత నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అక్టోబర్‌ 4వ తేదీన తొలి రోజు పరీక్ష తర్వాత మరుసటి రోజు నుంచి ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 27న తుది ఆన్సర్ ‘కీ’ విడుదల అవుతుంది. నవంబర్‌ 2వ తేదీన ఫలితాల ప్రకటన ఉంటుంది. ఓసీ(జనరల్‌) కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు 60 శాతం మార్కులు ఆపైన‌ వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక బీసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులకుపైన‌, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు 40 శాతం మార్కులకుపైన‌ మార్కులు వస్తే ఉత్తీర్ణత అయినట్లు అవుతుంది. కాగా ఈసారి మొత్తం 4,27,300 మంది అభ్యర్ధులు టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

టెట్‌ పరీక్ష విధానం..

టెట్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలకు జరుగుతుంది. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. శిశువికాసం, అధ్యాపన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌ 1 నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌ 2 నుంచి 30 ప్రశ్నలు, మెయిన్‌ సబ్జెక్ట్‌ నుంచి 60 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. అన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలే అడుగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..