TS edcet: నేటి నుంచి తెలంగాణ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమంటే..
తెలంగాణలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు..

తెలంగాణలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అలాగే 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విద్యార్థుల స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.
ఇక వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే ఈనెల 28వ తేదీన సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అనంతరం 28వ తేదీ నుంచి 30 వరకు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 31వ తేదీన ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం ఇచ్చారు. ఇక నవంబర్ 4వ తేదీన అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను వెల్లడిస్తారు. నవంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.




ఈ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రిపోర్టింగ్ సమయంలోనే ట్యూషన్ ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. ఇక తరగతులను నవంబర్ 14 నుంచి ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలకు http://edcetadm.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
