Railway jobs: స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గువాహటి కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గువాహటి కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అథ్లెటిక్స్, అర్చరీ, టెన్నిస్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్ విభాగాల్లో అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు వివిధ స్థాయుల క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ట్రయల్ ఆఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ, క్రీడాంశాల్లో ప్రతిభ, విద్యార్హత తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులను సీనియర్ పర్సనల్ ఆఫీసర్(రిక్రూట్‌మెంట్), నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హెచ్‌క్యూ, మాలిగావ్, గువాహటి, అసోం అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు గడువు 07-11-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..