Private Job: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. ఈ పార్ట్ టైమ్ జాబ్స్ పై ఓ లుక్ వేయండి..

ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఫర్హాన్ అజ్మీ ప్రకారం.. దాదాపు మూడు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం కంపెనీలు ఈ నెల ప్రారంభం నుండి 43 శాతం నియామకాలు చేపట్టారు. అటువంటి పరిస్థితిలో, ఖాళీగా ఉన్న పార్ట్ టైమ్ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం మీకోసం.. 

Private Job: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. ఈ పార్ట్ టైమ్ జాబ్స్ పై ఓ లుక్ వేయండి..
Part Time Jobs
Follow us
Surya Kala

|

Updated on: Oct 15, 2022 | 4:50 PM

దీపావళి నుంచి క్రిస్మస్‌ వరకూ పండుగల సీజన్‌ కొనసాగుతూనే ఉంటుంది. లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఇ-కామర్స్ఆ, టోమొబైల్స్ వంటి రంగాలలో కొత్త ఉద్యోగవకాశాలు పెరగడానికి ఇదే కారణం. 2022 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించిన TeamLease తాజా ఉపాధి ఔట్‌లుక్ నివేదికలో ఇది ప్రస్తావించబడింది. ఈ సీజన్ లో ఉద్యోగాల నియామకం 30 నుంచి 35 శాతం పెరుగుతుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు పెద్ద ఊరట లభించనుంది.

ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఫర్హాన్ అజ్మీ ప్రకారం.. దాదాపు మూడు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం కంపెనీలు ఈ నెల ప్రారంభం నుండి 43 శాతం నియామకాలు చేపట్టారు. అటువంటి పరిస్థితిలో, ఖాళీగా ఉన్న పార్ట్ టైమ్ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం మీకోసం..

డెకాథ్లాన్‌లో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులు లోకల్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ (LSP) లో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపిక అయిన వారు తమకు కేటాయించిన పరిధిలో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. మర్చండైజింగ్ , స్టాక్‌తో పాటు పైలటింగ్ , క్రీడల కోసం PNL (మార్జిన్, ష్రింకేజ్)ని నిర్వహించవలసి ఉంటుంది. చెన్నై, నవలూరులో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలలపాటు రూ.10 వేలు స్టైపెండ్ ఇస్తారు. దీని కోసం.. అభ్యర్థులు ఇంటర్న్‌షాలా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టామీ హిల్‌ఫిగర్‌లో ఇంటర్న్‌షిప్ ఎంచుకున్న ఇంటర్న్ క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్‌ను నిర్వహించాలి. రోజువారీ బాధ్యతలను నిర్వహించాలి. చెన్నై, పూణే, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై,  కొచ్చిన్‌తో సహా అనేక ప్రాంతాల్లో 40కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్న్‌శాలలో నాలుగు నెలల ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31. నైపుణ్యం, ఆసక్తి ఆధారంగా అభ్యర్థులకు నెలకు రూ.22,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది.

కస్టమర్ రిలేషన్ ఉద్యోగం గురుగ్రామ్‌లోని Noon.com పార్ట్‌టైమ్ ఉద్యోగానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కస్టమర్ తో సంబంధాన్ని ఏర్పరచగల అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది. కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ పోస్ట్ కోసం, అభ్యర్థులు ఇమెయిల్, చాట్ ద్వారా కస్టమర్ సమస్యలను పరిష్కరించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆరు నెలల అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్, ఎనలిటికల్, కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి. వారు లింక్డ్ఇన్ ద్వారా ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పాన్ కేక్ స్టోర్‌ లో ఉద్యోగవకాశాలు: ఓషివారాలోని 99 పాన్‌కేక్‌లు 99 పాన్‌కేక్ స్టోర్‌కు ఫ్రెషర్/అనుభవజ్ఞులైన సిబ్బంది అవసరం. ఈ పార్ట్ టైమ్ జాబ్‌లో పాన్‌కేక్‌లు, వాఫ్ఫల్స్, క్రేప్స్, షేక్స్, కూలర్‌లు, పేస్ట్రీలు, కేక్‌లను అమ్మాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రతి వారం 54 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు Indeed.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!