NTPC Recruitment: ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూఢిల్లీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూఢిల్లీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 864 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం) బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2022కి హాజరై ఉండాలి.
* అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీని నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను గేట్ 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 28-10-2022 తేదీన ప్రారంభమై, 11-11-2022 తేదీతో ముగుస్తుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..