TS ECET 2024 Answer Key: తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు ఇదే!

తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 ప్రాథమిక ఆన్‌సర్‌ 'కీ' విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రిలిమినరీ ఆన్సర్‌ 'కీ' డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలకు మే 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో..

TS ECET 2024 Answer Key: తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు ఇదే!
TS ECET 2024 Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: May 10, 2024 | 3:14 PM

హైదరాబాద్‌, మే 10: తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 ప్రాథమిక ఆన్‌సర్‌ ‘కీ’ విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రిలిమినరీ ఆన్సర్‌ ‘కీ’ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలకు మే 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో మాత్రమే తెలియజేయాలి.

తెలంగాణ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో సెకండ్‌ ఇయర్‌లో డైరెక్ట్‌గా ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యంతరాల స్వీకరణ అనంతరం త్వరలోనే ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.

తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్‌ 2024 రాత పరీక్ష ఫలితాలు విడుదల

యూపీఎస్సీ నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్‌ (NDA-1) 2024, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (CDS-1) 2024 రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాత పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 21వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌ ద్వారా 400 ఖాళీలు, సీడీఎస్‌ఈ ద్వారా 457 ఖాళీలు భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలో ఎంపికైన వారు తదుపరి దశకోసం సన్నద్ధం కావల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.