TS CPGET 2022 Result: తెలంగాణ సీపీగెట్‌-2022 ఫలితాలు నేడే విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CPGET)-2022 ఫలితాలు ఈ రోజు (సెప్టెంబర్‌ 20) విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాన స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ (ఉన్నత విద్యా మండలి) ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి..

TS CPGET 2022 Result: తెలంగాణ సీపీగెట్‌-2022 ఫలితాలు నేడే విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
Ts Cpget 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 21, 2022 | 6:41 AM

TS CPGET 2022 Result Link: తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CPGET)-2022 ఫలితాలు ఈ రోజు (సెప్టెంబర్‌ 20) విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాన స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ (ఉన్నత విద్యా మండలి) ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ చేతుల మీదగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సీపీగెట్‌ కన్వీనర్‌ ఐ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ యేడాది ఆగస్టు 11 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సీపీగెట్‌ 2022 పరీక్షలకు దాదాపు 57,262 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మొత్తం 45 సబ్జెక్టుల్లో పీజీ, 5 యేళ్ల ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లొమా కలిపి 50 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం- హైదరాబాద్.. 8 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.