AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Jobs: ‘త్వరలోనే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తాం’.. సీఎం రేవంత్‌

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందనీ.. ఒక్కసారి నోటిఫికేషన్ ఇస్తే, షెడ్యూల్ ప్రకారంగానే పరీక్షలు జరిగి తీరుతాయని సీఎం రేవంత్ అన్నారు. త్వరలోనే గ్రూప్ 1 అపాయింట్ మెంట్ లెటర్లు ఎంపికైన అభ్యర్ధులకు అందజేస్తామని..

TGPSC Group 1 Jobs: 'త్వరలోనే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తాం'.. సీఎం రేవంత్‌
CM Revanth
Srilakshmi C
|

Updated on: Feb 07, 2025 | 3:24 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గ్రూప్‌ 1 తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్‌ 1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.

563 మంది గ్రూప్‌ 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఏవిధమైన ఆరోపణలు లేకుండా టీజీపీఎస్సీ సమర్ధవంతంగా పని చేస్తోంది. కమిషన్‌ను రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోలేదు. అందుకే సీనియర్‌ ఐఏఎస్‌ బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించామని అన్నారు. అనంతరం వైద్యశాఖ గురించి మాట్లాడుతూ.. ఏడాదిలోనే 14వేల సిబ్బందిని వైద్య ఆరోగ్యశాఖలో నియమించడం ఒక చరిత్ర. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చినా ఎలాంటి వసతులూ కల్పించలేదు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గత పదేళ్ల పాలనను మీరు ప్రత్యక్షంగా చూశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, వైద్యం. అధికారం వచ్చిన ఏడాదిలోనే 50వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. 6500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల్లేవు. ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించినా.. పేపర్‌లీక్‌ను అరికట్టలేకపోయారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర వేదనకు గురయ్యారు. అన్నారు.

తమ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే, పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారంగానే పరీక్షలు జరుగుతాయని యువత నమ్ముతోంది. పరీక్షలు వాయిదా వేస్తూ పోతే మీ విలువైన యుక్త వయసు వృథా అవుతుంది. 21 నుంచి 35 ఏళ్ల లోపు మీరు చేసే పనులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యోగాలు ఇచ్చాం. ఇదీ మా చిత్తశుద్ధి అని ముఖ్యమంత్రి రేవంత్‌ తన ప్రసంగంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.