AIDS Control Society: తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. రూ. 60వేల వరకు జీతం పొందే అవకాశం.
AIDS Control Society Recruitment 2021: తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ సంస్థ...
AIDS Control Society Recruitment 2021: తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ సంస్థ జిల్లాల్లోని కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో మెడికల్ ఆఫీసర్, కౌన్సెలర్, ఫార్మసిస్ట్, స్టాఫ్‌నర్స్, కేర్ కోఆర్టినేటర్, న్యూటిషనిస్ట్, రీసెర్చ్ ఫెలో పోస్టులున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బీఎస్సీ (నర్సింగ్), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, పీఎల్‌హెచ్‌ఐవీ మాస్టర్స్ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * పోస్టును అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9000 నుంచి రూ. 60000 వరకు చెల్లిస్తారు. * అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * అభ్యర్థులు తమ పూర్తి వివరాలను జిల్లా కేంద్రాల్లోని మెడికల్ సూపరింటెండెట్/డైరెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. * పైన తెలిపిన పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏఆర్‌టీసీ, సీఓఈ, పీసీఓఈ, ఎల్‌ఏసీ, ఓఎస్‌టీ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Srikakulam district: ఏనుగులు బాబోయ్.. ఏనుగులు.. సిక్కోలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి
Indian Women Bangles: వివిధ రాష్ట్రాల్లో మహిళలు ధరించే గాజుల వెనుక రీజన్ ఏమిటో తెలుసా..
Nithiin’s Maestro: గన్ పట్టుకొని కిల్లర్ లేడీగా మారిన మిల్కీ బ్యూటీ.. మాస్ట్రో నుంచి న్యూ పోస్టర్..