TS SSC Supplementary Result: మరికాసేపట్లో తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు.. సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి..
TS SSC Supplementary Result: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. మరికాసేపట్లో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు...
TS SSC Supplementary Result: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. మరికాసేపట్లో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సైఫాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని అధికారులు తొలుత భావించారు అయితే చెప్పిన సమయం కంటే ముందుగానే ఫలితాలను విడుదల చేస్తున్నారు.
దీంతో ఎంతో మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుస్తున్నారు. ఇదిలా ఉంటే టెన్త్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 55,662 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరి కోసం 204 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఫలితాలను ప్రకటించిన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే టెన్త్ రెగ్యులర్ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..