Sainik School Jobs 2022: ఏపీలోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ పరిధిలోని అన్నమయ్య జిల్లాలోనున్న కలికిరి సైనిక్‌ స్కూల్‌ (Annamayya district Sainik School)... ఒప్పంద, తాత్కాలిక ప్రాతిప‌దిక‌న పీటీఐ క‌మ్ మాట్రన్‌, పీజీటీ (ఇంగ్లిష్‌/బయాలజీ), బ్యాండ్ మాస్టర్..

Sainik School Jobs 2022: ఏపీలోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
Sainik School Kalikiri
Follow us

|

Updated on: Sep 01, 2022 | 6:37 PM

Sainik School Kalikiri PGT Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ పరిధిలోని అన్నమయ్య జిల్లాలోనున్న కలికిరి సైనిక్‌ స్కూల్‌ (Annamayya district Sainik School)… ఒప్పంద, తాత్కాలిక ప్రాతిప‌దిక‌న పీటీఐ క‌మ్ మాట్రన్‌, పీజీటీ (ఇంగ్లిష్‌/బయాలజీ), బ్యాండ్ మాస్టర్, న‌ర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో డిగ్రీ/ డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్టులో ప‌ని అనుభ‌వం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు సెప్టెంబర్‌ 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/ అభ్యర్ధులు రూ.250లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు పోస్టు ద్వారా ఆగస్టు 22, 2022లోపు కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ సెప్టెంబర్‌ 20వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్ధులు నెలకు రూ.33,405 నుంచి రూ.62,356ల వరకు జీతంతో ఆయా పోస్టులకు ఎంపిక అవుతారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Sainik School Kalikiri, Annamayya district, AP.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.