TATA Memorial Centre: టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
TATA Memorial Centre Recruitment 2021: టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియర్ రెసిడెంట్‌లు, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
TATA Memorial Centre Recruitment 2021: టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియర్ రెసిడెంట్‌లు, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 64 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 64 ఖాళీలకు గాను.. సీనియర్ రెసిడెంట్ అనస్థీషియాలజీ (7), బయోకెమెస్ట్రీ (2), డెంటల్ అండ్ ప్రొస్థటిక్స్ సర్జరీ (1), హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ (4), హెమటోపాథాలజీ (2), మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆంకాలజీ (7), మైక్రోబయాలజీ (2), న్యూక్లియర్ మెడిసిన్ (2), పల్లియటివ్ మెడిసిన్ (2), పాథాలజీ (7), పీడియాట్రిక్ ఆంకాలజీ (7), పీడియాట్రిక్ సర్జికల్ ఆంకాలజీ (1), ప్రివెంటివ్ ఆంకాలజీ (2), రేడియేషన్ ఆంకాలజీ (7), రేడియో డయాగ్నోసిస్ (6), సర్జికల్ ఆంకాలజీ (7), ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ (2) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన ఖాళీలను అనుసరించి అభ్యర్థులు.. సంబంధిత విభాగాల్లో ఎండీ, డీఎన్‌బీ చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదీగా 28-06-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
SBI SO Recruitment 2021: ఎస్బీఐ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. జూన్ 28 చివరి తేదీ..
AP Exams: ఏపీ పది, ఇంటర్ పరీక్షలు జులైలోనే.. ఏర్పాట్లు చేస్తున్న విద్యా శాఖ..