SSC Steno Notification 2025: ఇంటర్ అర్హతతో కేంద్ర కొలువులు దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం ఇంటర్ అర్హతతో కేంధ్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో..స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025-26 సంవత్సరానికిగానూ కేంధ్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతోపాటు స్టెనోగ్రాఫ్‌సర్టిఫికెట్ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ కింద మొత్తం 261 పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ బీ, డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధుల వయసు ఆగస్టు 01, 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు తప్పనిసరిగా ఆగస్టు 2, 1995 నుంచి ఆగస్టు 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జూన్ 26, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జూన్ 6, 2025.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు దరఖాస్తు చివరి తేదీ: జూన్ 26, 2025.
- ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూన్ 27, 2025.
- దరఖాస్తు సవరణ తేదీలు: జులై 01, 2 తేదీల్లో
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీలు: ఆగస్టు 06 నుంచి ఆగస్టు 11 వరకు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.