SSC MTS 2024 Notification: పదోతరగతి అర్హతతో 8,326 కేంద్ర కొలువులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిష (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 8,326 ఎంటీఎస్‌, హవల్దార్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

SSC MTS 2024 Notification: పదోతరగతి అర్హతతో 8,326 కేంద్ర కొలువులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
SSC MTS 2024 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2024 | 3:14 PM

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిష (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 8,326 ఎంటీఎస్‌, హవల్దార్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం పొందిన వారికి జనరల్ సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్.. వంటి కేంద్ర మంత్రిత్వ విభాగాల్లో పోస్టింగ్‌ ఇస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన ఎస్సెస్సీ బోర్డు నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 01, 2024 నాటికి ఆయా పోస్టులను బట్టి 18 నంచి 25, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంటీఎస్‌ పోస్టులను సెషన్ 1, 2లలో ఆన్‌లైన్‌ రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. హవల్దార్ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 31, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

ఖాళీల వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య: 8,326

  • మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌మినిస్టీరియల్‌) పోస్టుల సంఖ్య: 4,887
  • హవల్దార్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల సంఖ్య: 3,439

రాత పరీక్షల విధానం..

సెషన్ 1లో న్యూమరికల్ అండ్‌ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలను 60 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగం నుంచి 20 ప్రశ్నలను 60 మార్కులకు అడుగుతారు. సెషన్ 2లో జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 25 ప్రశ్నలను 75 మార్కులకు అడుగుతారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు్కు చివరి తేదీ: జులై 31, 2024
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 01, 2024.
  • దరఖాస్తు సవరణ తేదీలు: ఆగస్టు16, 17 తేదీల్లో
  • రాత పరీక్ష పరీక్షల తేదీలు: అక్టోబర్‌ లేదా నవంబర్‌ 2024లో ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి