AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRTRI Free Training 2025: తెలుగు రాష్ట్రాల గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు..

SRTRI Free Training 2025: తెలుగు రాష్ట్రాల గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
SRTRI Free Training Programme
Srilakshmi C
|

Updated on: Aug 29, 2025 | 11:24 AM

Share

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ.. ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు సెప్టెంబర్‌ 3, 2025వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఉచిత శిక్షణ ద్వారా అందించే కోర్సుల వివరాలు ఇవే..

  • కంప్యూటర్‌ హార్డ్‌ వేర్‌, సెల్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల రిపైర్‌, సి.సి టీవీ టెక్నీషయన్‌
  • టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్ట్‌ బ్యాగ్స్‌ మేకింగ్‌
  • ఎలక్ట్రీషియన్‌(డిమెస్టిక్‌) సోలార్‌ సిస్టమ్‌ ఇనస్టలేషన్‌, కర్వీస్‌
  • అడ్వాన్స్‌ వెల్డర్‌, వెల్డింగ్ అండ్‌ ఫ్యాబ్రికేషన్‌

సంబంధిత కోర్సులను అనుసరించి సంబంధిత విభాగంలో ప్రవేశాలకు ఎనిమిది, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ప్రస్తుతం పాఠశాలల్లో చదువు మధ్యలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. వీరు అందించే కోర్సు వ్యవధి ఆరు నెలల వరకు ఉంటుంది. అడ్వాన్స్‌ వెల్డర్‌, వెల్డింగ్ అండ్‌ ఫ్యాబ్రికేషన్‌ కోర్సు మాత్రం 3 నెలల వ్యవధి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ కింది చిరునామాలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు సెప్టెంబర్‌ 3, 2025న ఉదయం 10 గంటలకు సంబంధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సంస్థలో హాజరుకావల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 ఫోన్‌ నంబర్ల ద్వారా పని వేళల్లో సంప్రదించవచ్చు.

అడ్రస్: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్‌(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ-508 284.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.