Southern Railway Apprentice 2021: స‌ద‌ర‌న్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. అకడెమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక..

Southern Railway Apprentice 2021: సద‌ర‌న్ రైల్వేలో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న పెరంబూరులోని క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ వర్క్స్‌కు చెందిన చీఫ్‌ వర్క్‌షాప్‌...

Southern Railway Apprentice 2021: స‌ద‌ర‌న్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. అకడెమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక..
Southern Railway Posts
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 04, 2021 | 11:33 AM

Southern Railway Apprentice 2021: సద‌ర‌న్ రైల్వేలో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న పెరంబూరులోని క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ వర్క్స్‌కు చెందిన చీఫ్‌ వర్క్‌షాప్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వ‌విధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 3378 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఫ్రెషర్‌ కేటగిరీ, ఎక్స్‌ ఐటీఐ, ఎంఎల్‌టీ విభాగాల్లో.. ఉన్న ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల‌ను తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియెట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌/బయాలజీ)ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థులు 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు క‌ల్పిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను అకడెమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 30.06.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Indian Army Jobs 2021: ఇండియ‌న్ ఆర్మీలో ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

North Korea: ఉత్తర కొరియాలో ఆకలి కేకలు.. విదేశాల సాయం కోరేందుకు కిమ్‌కు నోరు వస్తుందా?

Telangana Corona Cases: కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వ‌రం.. భ‌క్తుల‌కు నో ఎంట్రీ