AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Exam: ఏపీ ‘టెట్‌’ ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలో ఘోర తప్పిదం.. వారికి 30 మార్కులు హుష్?

ఏపీ టెట్ జులై-2024 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పేపర్ 2 రాసిన వారికి అన్యాయం జరిగింది. వీరికి పరీక్షలో మతృభాష తెలుగుకు బదులు ఇంగ్లిష్ సబ్జెక్ట్ వచ్చింది. దీంతో చేసేదిలేక వారంతా అలాగే పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రం నుంచి బయటికి వచ్చాక అందరికీ ఇలాగే జరిగిందని తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు..

AP TET 2024 Exam: ఏపీ 'టెట్‌' ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలో ఘోర తప్పిదం.. వారికి 30 మార్కులు హుష్?
AP TET 2024 Exam
Srilakshmi C
|

Updated on: Oct 24, 2024 | 2:37 PM

Share

అమరావతి, అక్టోబర్‌ 24: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది. అయితే టెట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ (2ఏ) ఇంగ్లిష్‌ సబ్జెక్టులో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్ధులు లబోదిబోమంటున్నారు. ఈ పేపర్ రెండో సెక్షన్‌లో మాతృ భాషగా తెలుగు సబ్జెక్టు రాయాల్సి ఉండగా, చాలామందికి ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ రావడం వివాదంగా మారింది. నిజానికి, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ ఎస్‌ఏ వారికి దరఖాస్తు సమయంలోనే మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఎస్‌ఏ ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు టెట్‌లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాజీ, మాతృభాష, జనరల్‌ ఆంగ్లం, సబ్జెక్టు కంటెంట్‌-మెథడాలజీ ఉంటాయి. రెండో సెక్షన్‌లో సాధారణంగా మాతృభాషగా తెలుగు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. కానీ చాలా మంది మళ్లీ ఆ విభాగంలో తెలుగుకు బదులుగా మళ్లీ ఇంగ్లిష్‌నే ఎంపిక చేసుకున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన టెట్‌ ప్రకారం మాతృభాషను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా కొందరు అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. కొందరు తెలుగు ఎంపిక చేసుకోవడం, మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్లం ఎంపిక చేసుకోవడంతో మార్కుల్లో వ్యత్యాసం వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌ రాసే వారిలో తమిళ్, కన్నడ, ఒడియావారు కూడా ఉన్నారు. దీంతో మాతృభాషగా అన్ని సబ్జెక్టులూ వచ్చేలా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసే సమయంలో రెండో సెక్షన్‌ మాతృభాషకు సంబంధించి ఎవరికి వారు ఆయా భాషలను ఎంపిక చేసుకోవాలి. తెలుగు రాయాల్సిన వారు తెలుగుకు బదులు మళ్లీ ఆంగ్లాన్నే ఎంచుకోవడంతో సమస్య తలెత్తింది. నిజానికి, టెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుప్పటికీ ఆంగ్ల సబ్జెక్టే వచ్చింది. దీనిపై అప్పట్లో అభ్యర్థులు ఫిర్యాదు చేస్తే సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణంగా ఇలా జరిగిందనీ, పరీక్ష సమయంలో మార్పు చేస్తామని పేర్కొన్నారు. కానీ, తాజాగా జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షలో మాత్రం అభ్యర్థుల మాతృభాషగా తెలుగుకు బదులు ఇంగ్లిష్‌ ఓపెన్‌ అయ్యింది. దీంతో అభ్యర్థులు తెలుగు పరీక్ష రాయలేదు.

టెట్‌ నిబంధనల ప్రకారం నాలుగు విభాగాలకు కలిపి మొత్తం 150 మార్కులు ఉంటాయి. సబ్జెక్టు కంటెంట్‌-పెడగాజీకి 90మార్కులు మిగతా మూడు సెక్షన్లకు 30 మార్కుల చొప్పున ఉంటాయి. ఇప్పుడు మాతృభాష సబ్జెక్టు ఎంపికలో జరిగిన మార్పు కారణంగా 30 మార్కుల్లో తేడాలు వస్తే తమకు ర్యాంకులు మారిపోతాయని అభ్యర్థులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..