SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
SPMCIL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...
SPMCIL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటితో (శుక్రవారం)తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 135 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్ వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
* వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* సూపర్ వైజర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు.. డైస్టఫ్ టెక్నాలజీ, పెయింట్ టెక్నాలజీ/ సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ/ఇంక్ టెక్నాలజీ/ ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిప్లొమా (ఐటీ/కంప్యూటర్)లో ఉత్తీర్ణత సాధించాలి.
* జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసుకునే వారు కంప్యూటర్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 80,000 నుంచి రూ. 1,20,000 వరకు అందిస్తారు.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 12,2021 నుంచి ప్రారంభం కాగా నేటితో (శుక్రవారం)తో ముగియనుంది.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!