Neet Exam 2021: కొంతమంది కోసం లక్షాదిమంది విద్యార్థులను ఇబ్బంది పెట్టలేం.. నీట్ వాయిదాకు సుప్రీం నో

Supreme Court on Neet Exam: నీట్ పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చింది. తాజాగా నీట్ 2021 పరీక్షలను వాయిదా వేయమని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. అంతేకాదు.. కేవలం కొంతమంది..

Neet Exam 2021: కొంతమంది కోసం లక్షాదిమంది విద్యార్థులను ఇబ్బంది పెట్టలేం.. నీట్ వాయిదాకు సుప్రీం నో
Sc On Neet
Follow us
Surya Kala

|

Updated on: Sep 06, 2021 | 4:14 PM

Supreme Court on Neet Exam: నీట్ పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చింది. తాజాగా నీట్ 2021 పరీక్షలను వాయిదా వేయమని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. అంతేకాదు.. కేవలం కొంతమంది కోసం ఆలోచిస్తూ.. 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షను వాయిదా వేయలేమని తెలిపింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నీట్ పరీక్ష నిర్వహణలో కలుగజేసుకోదలుచుకోలేదని, పరీక్ష తేదీని మార్చటం సరైన నిర్ణయం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దీంతో నీట్ పరీక్ష ఈనెల 12నే నీట్‌ జరగనుంది.

అయితే ఈనెల నీట్ పరీక్ష తో పాటు ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్​ఈ కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల నీట్‌ వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టు లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌రు షికేష్‌రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేసింది. నీట్ వాయిదా పిటిషన్ ను తోసిపుచ్చింది. అయినా విద్యా వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఎక్కువగా జోక్యం చేసుకోదు. తమ తీర్పుల వల్ల లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. అదే రోజు ఎక్కువ పరీక్షలు ఉంటే.. ఏది ముఖ్యమో విద్యార్థులే ఎంచుకుని.. పరీక్ష రాయాల్సి ఉంటుందని .. అంతేకాని.. కేవలం కొంతమంది కోసం నీట్ వాయిదా వేయడం కరెక్ట్ కాదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీట్ పరీక్ష ఒక రాష్ట్రానికి సంబందించింది కాదు.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు సంబంధించిన పరీక్ష. దీనిని వాయిదా వేసి.. రీ షెడ్యూల్ చేయడం అంటే.. విద్యా సంవత్సరం పై ప్రతికూలత ఏర్పడుతుందని అభిప్రాయం పడింది.

ఇక ఈ ఏడాది నీట్ పరీక్ష 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్ర విద్యా శాఖా ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది తొలిసారి పంజాబీ, మలయాళాన్ని చేర్చుతున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ జులైలో ప్రకటించిన సంగతి తెలిసిందే..

Also Read:  యాడ్ ద్వారా పరిచయం..యువీ వార్నింగ్.. రోహిత్-రితికాల లవ్‌స్టోరీలో ఎన్నో ట్విస్టులు..